FbTelugu

అబద్దాల వైఎస్ ఫ్యామిలీ: అయ్యన్నపాత్రుడు

విజయనగరం: అబద్ధాలాడటంలో వై.ఎస్ కుటుంబాన్ని మించిన వారు ప్రపంచంలోనే లేరని వైఎస్.విజయమ్మ లేఖతో తేలిపోయిందని మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. విజయమ్మ కళ్లకున్న గంతలు తీసేసి, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలని ఆయన హితవు పలికారు.
మంగళవారం అయ్యన్నపాత్రుడు తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడారు. మాజీ ఎంపి వైఎస్.వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణలో సిబిఐ విచారణ కావాలని, తరువాత ఎందుకు వద్దన్నాడో రాజమాత తనబిడ్డను ప్రశ్నించాలని అన్నారు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు తండ్రిలేని బిడ్డను ఆదరించాలని విజయమ్మ కోరిందని, వాడవాడలా ఏడిచిందన్నారు. మరిప్పుడు తండ్రిని కోల్పోయి తనకు న్యాయం జరగడంలేదంటున్న సునీతకు, విజయమ్మ ఏం సమాధానం చెబుతుంది? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

రాజశేఖర రెడ్డిని రిలయన్స్ వారే చంపారని ఆ సంస్థ ఆస్తులు తగలబెట్టించిన జగన్, తిరిగి వారికే సన్మానాలు, సత్కారాలుచేయడమేంటి?. రిలయన్స్ అధినేత ముకేశ్ చెప్పిన వ్యక్తిని రాజ్యసభకు పంపడమేంటి?. తన కొడుకు అవసరార్థం సాగిస్తున్న కుటిల రాజకీయాల గురించి ప్రశ్నించాల్సిన బాధ్యత రాజమాతపై లేదా?. వివేకా డైరీని స్థానిక పోలీసులు సిబిఐకి ఎందుకివ్వడంలేదో విజయమ్మ స్పష్టంచేయాలి. జగన్ కు దెబ్బతగిలిన ప్రతిసారి విజయమ్మ బయటకువస్తుంది, అలావచ్చే, కుటుంబసభ్యులంతా కలిసి రాష్ట్రాన్ని ఈ స్థితికి చేర్చారన్నారు. ఆంధ్రాని జగన్, తెలంగాణను షర్మిల తీసుకున్నట్లే, విజయమ్మ తమిళనాడు, భారతి కర్ణాటకను పంచుకుంటారేమో? అని అనుమానం వ్యక్తం చేశారు. తనకొడుక్కి బుద్ధిచెప్పి, రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత విజయమ్మపైనే ఉందని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.