FbTelugu

వైసిపి నేతలకు ఇళ్లల్లోనే వ్యాక్సిన్: మాజీ మంత్రి అయ్యన్న

విశాఖపట్నం: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్లు వృధా కావడం లేదని, కేంద్రం కళ్లుగప్పి పక్కదారి పట్టించి వైసిపి నేతలకు ఇళ్లల్లోనే ఇస్తున్నారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరోపించారు.

మొగుడ్ని కొట్టి మొగ‌సాల‌కి ఎక్క‌డం అంటే ఇదే జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. కేంద్రం పంపిన వ్యాక్సిన్లను అతి ఎక్కువ వృథా చేస్తోన్న రాష్ట్రాల‌లో ఆంధ్రా మొదటి స్థానంలో ఉందని, అందుకే రాష్ట్రానికి వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాపై కొన్ని ఆంక్ష‌లు కేంద్రం విధించింద‌ని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయన్నారు. వ్యాక్సిన్ వృథా కావ‌డంలేద‌ని, కేంద్రం క‌ళ్లుగ‌ప్పి ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నారని వెల్ల‌డైందన్నారు. ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడేందుకు అత్య‌వ‌స‌ర‌మైన వ్యాక్సిన్లు అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు తెప్పించుకుంటే, జ‌గ‌న్‌రెడ్డి మాత్రం చంద్ర‌బాబు నాయుడు, టిడిపి నేత‌ల‌పై త‌ప్పుడు కేసులు పెట్టే ప‌నిలో నిమగ్నమై ఉన్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డి కేంద్రం పంపిన వ్యాక్సిన్ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించారు. ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త తీవ్రం కావ‌డంతో ఇదిగో ఇలా చంద్ర‌బాబు బంధువుల‌ది కోవాగ్జిన్ వ్యాక్సిన్ కంపెనీ అని, అందుకే ఇవ్వ‌నీయ‌డంలేద‌ని ఎద‌వ ఏడుపులు ఏడుస్తున్నాడు జగన్ అంటూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విరుచుకుపడ్డారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.