FbTelugu

విశాఖలో విజయసాయి వసూళ్లు రూ.400 కోట్లు

సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి
హైదరాబాద్: వైసీపీ రాజ్యసభ సభ్యుడు, సీఎం వైఎస్.జగన్ ప్రధాన సన్నిహితుడు వి.విజయసాయి రెడ్డి జీవీఎంసీ ఎన్నిల కోసం రూ.400 కోట్లు వసూలు చేశారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు.

ఈ మొత్తం కేవలం 10 రోజుల్లోనే పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్ల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారన్నారు. ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలో బెదిరింపు రాజకీయాలు లేవని, వైసీపీ రాకతో మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు విజయసాయి వసూళ్ల వివరాలను ఆధారాలతో సహా బహిర్గతం చేస్తానని సత్యనారాయణ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.