FbTelugu

 జగన్ ఇంటికి రాష్ట్ర బడ్జెట్ సరిపోదు: మాజీ మంత్రి అయ్యన్న

అమరావతి: వామ్మో అది ఇల్లా? మాయా మహలా?ఎన్నికల ముందే నిర్మాణం పూర్తయ్యింది అన్న జగన్ రెడ్డి తాడేపల్లి రాజ ప్రసాదంలో కరెంటు పనికి 3.63 కోట్ల బిల్లా? అంటూ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సోఫాలు, కుర్చీలకు రూ.39 లక్షలా? ఒక్క రూపాయి జీతగాడు వైఎస్.జగన్ రెడ్డి రాజ భవనాల సోకులకు రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోయేలా లేదు అని ట్వీట్ చేశారు. రంగులు, హంగులు, సోకులకు ప్రజా ధనం వృధా చెయ్యడం ఆపి, మీరు ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యండి జగన్ రెడ్డి గారు!! అని అయ్యన్న పాత్రుడు హితవు పలికారు.

ప్రజాధనం దుబారా సరికాదు…

ప్రజా ధనంతో దుబారా సబబు కాదు జగన్ రెడ్డి గారు. మంచినీళ్లు, మజ్జిగ కోసం ఒక కోటి, కరెంట్ పని, కుర్చీల కోసం రూ.4 కోట్లు. మంది సొమ్ముతో విలసాలు ఏంటి? ఊరికో రాజ భవనం నిర్మించుకోవడం మీకు ఫ్యాషన్ అయినా వాటిని నిర్వహించే స్తోమత రాష్ట్ర ప్రజలకు లేదు జగన్ రెడ్డి గారు అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.