FbTelugu

ఏసీబీ కస్టడీకి మాజీ మంత్రి అచ్చెన్న

గుంటూరు: టీడీఎల్పీ నాయకుడు కే.అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు.

గుంటూరు గవర్నమెంటు హాస్పిటల్ (జీజీహెచ్) లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో గలాటా జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ బుధవారం అర్థరాత్రి అచ్చెన్నను డిశ్చార్జీ చేశారు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకునేందుకు రాగా టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

హాస్పిటల్ లోనే విచారించాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసినప్పటికీ బేఖాతరు చేస్తూ బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. దీనిపై టీడీపీ నాయకులు దేవినేని ఉమా, నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ లోకేష్ బాబు ప్రభుత్వ వైఖరిని తూర్పారపట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.