FbTelugu

నేను చావలేదు… బతికే ఉన్నా..!: సుమిత్రా మహజన్

న్యూఢిల్లీ: సోషల్ మీడియా పుణ్యమా అని దేశంలోని ప్రముఖులు తలలు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా లోకసభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్‌ చనిపోయినట్లు తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

తను చనిపోయినట్లు వస్తున్న తప్పుడు వార్తలపై లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ శుక్రవారం తీవ్రంగా స్పందించారు. తను మరణించానో లేదో అధికారికంగా నిర్ధారణ చేసుకోకుండా అంత తొందర ఏంటని ఆమె ప్రశ్నించారు. నా మరణం గురించి ఇండోర్‌ అధికారుల నుంచి సమాచారం తీసుకోకుండా న్యూస్‌ ఛానల్స్‌ చనిపోయినట్లు ఎలా చెబుతాయి. నా మేనకోడలు… కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్‌ను ట్విటర్‌లో ఖండించారు. తన చావును కానీ ధృవీకరించకుండా ప్రకటించాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు.
కాగా సుమిత్ర మహాజన్‌ చనిపోయారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ ఆమెకు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు గురువారం ట్వీట్‌ చేశారు. అయితే సుమిత్ర ఇంకా బతికే ఉందని, ఆరోగ్యంగా ఉందని ఆమె మేనకోడలు, బీజేపీ నేతలు చెప్పడంతో వెంటనే శశిథరూర్‌ ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. కానీ అప్పటికే ఆ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆయనతోపాటు కొన్ని మీడియా ఛానళ్లు సైతం తప్పుగా ప్రసారం చేశాయి. అయితే నిజం తెలిశాక ఆమె చనిపోలేదని మళ్లీ పేర్కొన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.