FbTelugu

సబ్ ప్లాన్ నిధులు అక్క ఒడికి మళ్లింపు: మాజీ జడ్జి శ్రవణ్

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను అమ్మ ఒడి, అక్క ఒడి పథకాలకు మళ్లించిందని మాజీ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ ఆరోపించారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా జై భీమ్ యాక్సిస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. లాడ్జి సెంటర్ లో అంబేడ్కర్ విగ్రహానికి మాజీ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ పూలమాలలు వేశారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ఒక ప్రత్యామ్నాయ శక్తి గా ఎదుగుతామని శ్రవణ్ కుమార్ హెచ్చరించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ మనసాక్షి కి నచ్చిన విధంగా ఓటు వేయాలని ఆయన కోరారు. మాకు వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు లేరు రాజకీయంగా అందరూ శత్రువులేనని శ్రవణ్ కుమార్
అన్నారు.

రాష్ట్రంలో దళితుల కోసం త్వరలో ఒక రాజకీయ పార్టీ నీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రలో మా రాజకీయ భవిష్యత్ పై కార్యాచరణ ప్రణాళిక వెల్లడిస్తామని ఆయన తెలిపారు. గతంలో ఉన్న టిడిపి కి కూడా మేము ప్రత్యామ్నాయంగా ఉండ బోతున్నామని శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.