FbTelugu

విశాఖ స్టీలుపై మాజీ ఐపిఎస్ లక్ష్మీనారాయణ పిల్

అమరావతి: మాజీ ఐపీఎస్ అధికారి వివి.లక్ష్మీనారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

నష్టాల సాకుతో ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లాభాలు తీసుకురావచ్చని ఆయన తన పిటీషన్ లో తెలిపారు. విశాఖ స్టీలు విక్రయంపై కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని తన పిటీషన్ లో కోరారు. ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన తరువాత లక్ష్మీనారాయణ జనసేన తరఫున విశాఖపట్నం లోకసభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత జనసేన నుంచి కూడా ఆయన నిష్క్రమించారు.

విశాఖ స్టీలు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. కార్మికుల ఉద్యమానికి దేశ వ్యాప్తంగా పలు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. లక్ష్మీనారాయణతో పాటు టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కూడా సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. శ్రీనివాస రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు. ప్రైవేటీకరణను నిలువరించేందుకు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.