FbTelugu

తనపై సిబిఐ విచారణ జరపాలి: మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్

అమరవతి: తనపై సిబిఐ విచారణ జరపాలని లేదంటే హైకోర్టును ఆశ్రయించనున్నట్లు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎబి.వెంకటేశ్వర్ రావు ఏపి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు.
సిబిఐతో తన కేసు దర్యాప్తు చేయించాలని ఎబి.వెంకటేశ్వర రావు కోరారు. తన ఆరోపణలను రుజువు చేసే 9 పత్రాలను లేఖకు జోడించి పంపించారు.

డిజిపి గౌతం సవాంగ్ తన స్వహస్తాలతో ఫోర్జరీ చేసినట్టు ఆరోపించారు. డిజిపి సవాంగ్, సిఐడి అడిషనల్ డిజి సునీల్ కుమార్, ఎసిబి డిజి సీతారామాంజనేయులు, ఇంటెలిజెన్స్ అధికారులు, మరికొందరి ప్రమేయం ఉందని తెలిపారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ విచారణ జరిపిన సందర్భంలో దొంగ డాక్యుమెంట్లను సమర్పించారని గతంలోనే మీ దృష్టికి తీసుకువచ్చానని వెంకటేశ్వర రావు వివరించారు. తన లేఖ అందిన తరువాత కూడా సిబిఐతో విచారణకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.