అమరావతి: మాజీ ఇంటెలీజెన్స్ చీఫ్ ఏబీ.వెంకటేశ్వర రావుపై ఉన్న సస్పెన్షన్ ను హైకోర్టు ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఆయనపై ఉన్న క్యాట్ ఆర్డర్‌ను కూడా న్యాయస్థానం పక్కనపెడుతూ తీర్పునిచ్చింది. వైఎస్.జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు పై ఫిబ్రవరి 8న వేటు వేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన రిట్ పిటీషన్‌ను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలను చెల్లించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ప్రజాప్రయోజనాల రీత్యా ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. సస్పెన్షన్‌పై ఆయన క్యాట్‌ను ఆశ్రయించినా ఊరట లభించలేదు. గత ప్రభుత్వంలో వెంకటేశ్వరరావు విజయవాడ కమిషనర్‌గా, ఇంటెలిజెన్స్ ఛీప్‌గా పనిచేశారు. వైసీపీ పట్ల కఠినంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.