FbTelugu

శ్రీవాణి ట్రస్ట్ విరాళాలు ఎక్కడ: మాజీ ఐఏఎస్ ప్రశ్న

తిరుమల: టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ అక్రమాలను ప్రశ్నించిన మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు వైసీపీ ప్రభుత్వంలోనూ విమర్శలు గుప్పిస్తున్నారు.
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన విరాళాల వివరాలను టీటీడీ భక్తులకు తెలియచేయాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులను దేవాలయాల నిర్మాణానికి వినియోగిస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఏమి చేసారో టీటీడీ భక్తులకు వివరించాలన్నారు. హిందూ ధర్మపరిరక్షణ మాటలలో… కట్టు బొట్టులో ఉంటే సరిపోదు… ఆచరణాత్మకంగా చేసి చూపాలి అంటూ పరోక్షంగా సీఎం జగన్ ను ఎత్తిచూపుతూ ఆయన ట్వీట్ చేశారు.

పెరిగిన భక్తుల రద్దీ…
తిరుమలలో భక్తుల రద్దీ పెరగ్గా, సోమవారం శ్రీవారిని దాదాపు 55 వేల మంది భక్తులు దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. సోమవారం నాడు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.38 కోట్లు వచ్చింది. శ్రీవారిని 54855 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు టీటీడీ తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.