FbTelugu

గుజరాత్ మాజీ సీఎం కన్నుమూత

గాంధీనగర్: గుజరాత్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ్ సింగ్ సోలంకి(93) ఇవాళ ఉదయం కన్నుమూశారు. సోలంకి గుజరాత్ కు నాలుగు సార్లు మఖ్యమంత్రిగా పనిచేశారు.

ఒక దఫా కేంద్ర విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు. సోలంకి మృతి పట్ల రాజకీయ ప్రముఖులు తీవ్రం సంతాపం వ్యక్తం చేశారు. సోలంకి గొప్ప నేత అని, దశాబ్దాలపాటు కీలక పాత్ర పోషించారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఆయన కుమారుడు భరత్ సోలింకితో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.