FbTelugu

మాజీ కార్పొరేటర్ భర్త ఆత్మహత్య

విశాఖపట్నం: మాజీ కార్పొరేటర్ పీలా ఉమారాణి భర్త శ్రీనివాస్ దువ్వాడ రైల్వే స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఈరోజు తెల్లవారు జామున కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగారు.

స్టేషన్ లోనే ఉన్న నాలుగో నంబర్ ప్లాట్ ఫాం మీదనున్న బెంచి మీద పడిపోయారు. రైల్వే పోలీసులు వచ్చి చూసేసరికి ఆయన అప్పటికే మృతి చెందారు. కొద్ది నెలలుగా ఇంట్లో ఆస్తుల తగాదాలు జరుగుతున్నాయని, కుటుంబ సభ్యులు ఎవరూ తన మాట వినడం లేదని ఆత్మహత్యకు ముందు లేఖ రాశారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెంది చనిపోతున్నానని పేర్కొన్నారు. ఘటనా స్థలం వద్ద పోలీసులు లేఖను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించారు.

You might also like