రాయపూర్: ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం అజిత్ ప్రమోద్ కుమార్ జోగి(74) ఇవాళ మృతి చెందారు. అజిత్ జోగి ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి తొలి సీఎంగా పనిచేశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల కోమాలోకి వెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఆయన కన్నుమూశారు.