FbTelugu

అసోం మాజీ సీఎం కన్నుమూత

డిస్పూర్ : ఈశాన్య రాష్ట్రం అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్(84) అనారోగ్యంతో నిన్న(సోమవారం) సాయంత్రం కన్నుమూశారు. 3 నెలల క్రితమే తరుణ్ గొగోయ్‌ కరోనా బారిన పడ్డారు.

దాదాపు రెండు నెలల ఆస్పత్రిలో చికిత్స తీసుకొని కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవల తరుణ్ గొగోయ్ లో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి నిన్న కన్నుమూశారు. గొగోయ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.