FbTelugu

వ్యాక్సిన్ కు రూ.45 కోట్లేనా?: చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు కు రూ. 1600 కోట్లు అవసరం కాగా.. రూ.45 కోట్లు మాత్రమే మంజూరు చేశారని, ప్రజల ప్రాణాలకు మీరిచ్చే విలువ ఇదేనా? అని మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు నిలదీశారు.
ప్రజల ప్రాణాలకన్నా కమీషన్లు దండుకునే సిఎం జగన్ రెడ్డికి అధికారంలో కొనసాగే హక్కుందా? అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడాలి లేదా సీఎంగా తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ పార్టీ సీనియర్ నేతలతో టిడిపి అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.

దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల డోసుల కోసం సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్‌ కు ఆర్డర్లతో పాటు అడ్వాన్సు చెక్కులిచ్చి వ్యాక్సిన్ పొందుతున్నాయన్నారు. కొన్ని రాష్ట్రాల్లో 18-45 ఏళ్ల యువతకు వ్యాక్సిన్ ఇస్తున్నాయన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచిందన్నారు. మరి జగన్ ప్రభుత్వం వ్యాక్సిన్ కోసం ఎందుకు ఆర్డర్లు పెట్టలేదు? అని చంద్రబాబు నిలదీశారు.
పైగా నిన్న, మొన్నటి వరకు వ్యాక్సిన్ల కోసం జగన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని మంత్రులు ప్రకటనలు ఇచ్చారని, ఇప్పుడు బాధ్యతల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్.440కె వైరస్ ఉందని చెబితే నాపై నెపం నెట్టే కుట్రకు దిగజారారన్నారు. నేను వ్యాక్సిన్ తెప్పిస్తే మరి మీరెందుకు? అని ప్రశ్నించారు. తమిళనాడు ప్రభుత్వం తరహాలో కరోనా బాధితులకు ప్యాకేజీ ఇవ్వాలని, ఏపిలో అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి కరోనా బాధితులతో పాటు పేదల ఆకలి తీర్చాలని చంద్రబాబు నాయుడు జగన్ రెడ్డికి సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.