FbTelugu

కౌన్సిల్ మాజీ ఛైర్మన్ తో బీజేపీ నేతల భేటీ

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి మాజీ ఛైర్మన్ కె.స్వామి గౌడ్ తో బీజేపీ రాష్ట్ర నాయకులు భేటీ అయ్యారు. పార్టీలోకి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు.

బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 4 లో ఇవాళ స్వామిగౌడ్ తో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఓబీసీ సెల్ ఛైర్మన్ డా.కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆయనతో చర్చలు జరిపారు. సుమారు గంట పాటు రాష్ట్ర, దేశ రాజకీయాలు, గ్రేటర్ ఎన్నికలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, స్వామి గౌడ్ తో స్నేహ పూర్వక భేటీ అయ్యామని అన్నారు. బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు పెట్టలేదని, రాష్ట్రంలో పాలనపై ప్రధానంగా చర్చించామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.