FbTelugu

ఫారెస్టు అవినీతి అధికారులపై వేటు

చిత్తూరు: ఫారెస్టు అధికారులైన కుప్పం ఎఫ్ఆర్వో కాలప్పనాయుడు, పలమనేరు సెక్షన్ ఆఫీసర్ మధుసూదన్ లపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకెళితే.. జిల్లాలోని రామకుప్పం మండలం ననియాల అటవీ పనుల్లో అవినీతి జరిగినట్టుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

దీంతో దీనికి బాధ్యులుగా భావిస్తూ ఎఫ్ఆర్ఓ కాలప్పనాయుడు, సెక్షన్ ఆఫీసర్ మధుసూదన్ లపై సస్పెన్షన్ వేటు వేశారు. చిత్తూరు వెస్ట్ డీఎఫ్ఓ చక్రపాణి, రిటైర్డ్ డీఆర్ఓ రంగయ్య, మరో ముగ్గురు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చారు.

You might also like