దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకునన్ది. క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్నది. బోర్న్ ఐడెంటిటీ, ఎక్స్ మెన్, గ్లాడియేటర్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ హైదరాబాద్ కు వచ్చారు. పావెల్ పర్యవేక్షణలో క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. ఫైటింగ్ సన్నివేశాల కోసం యూఎస్ నుంచి 40 మంది ఫైటర్లు హైదరాబాద్ వచ్చారు. వీరందరూ ఇద్దరు హీరోలతో తలపడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం చిత్ర నిర్మాణం పూర్తయితే అక్టోబర్ 13న సినిమాను విడుదల చేయనున్నారు.