అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీషు మీడియం కోసం సంతకాల సేకరణ ఆపాలని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. హైకోర్టు తీర్పును దిక్కరించే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను విద్యాశాఖ పావులుగా వాడుకుంటోందని అన్నారు.
బలవంతంగా వారి నుంచి లేఖలను రాయిస్తూ.. కోర్టులను ప్రభావితం చేయాలని చూస్తూన్నారని ఆరోపించారు. అమ్మఒడి, విద్యాదీవెన వంటి పథకాలు ఇవ్వాలంటే ఇంగ్లీషు మీడియం ఉండాలని సంతకాలు పెట్టిస్తున్నారని అన్నారు.