FbTelugu

ఉరేసుకొని ప్రేమజంట బలవన్మరణం

 సూర్యాపేట : ప్రేమజంట ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన జిల్లాలోని మునగాల మండలం, మొద్దుల చెరువు గ్రామంలో చోటుచేసుకొని తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చందుపట్ల గ్రామానికి చెందిన ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు.

కాగా నిన్న సాయంత్రం మొద్దుల చెరువు గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరేసుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.