అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరుణంలో ఆయన టీడీపీ శ్రేణులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ పతనానికి ఈ పంచాయతీ ఎన్నికలే నాంది కావాలన్నారు. అలాగే రాష్ట్రంలో వైసీపీ రౌడీ రాజ్యానికి ముకుతాడు వేయాలని సూచించారు. అన్ని పంచాయతీలలో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉండాలని తెలిపారు. కోడ్ అమల్లో ఉన్న ఈ సమయంలో వైసీపీ నేతల దౌర్జన్యాలను వీడియో రికార్డులు చేసి టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపాలని తెలిపారు.