FbTelugu

ఆ ఏటిఎం లో కస్టమర్లకు కనకవర్షం

వనపర్తి: మనం ఏదైనా బ్యాంకు ఏటిఎం కు వెళ్ళి డెబిట్ కార్డు పెట్టి డబ్బులు డ్రా చేసుకుంటాం. మనం రూ.5వేలు కావాలని కోరితే అంతే మొత్తం అందులో నుంచి బయటకు వస్తాయి. దీనికి పూర్తి వ్యతిరేకంగా ఒక ఏటిఎం నుంచి ఊహించని స్థాయిలో డబ్బులు రావడంతో కస్టమర్లు క్యూ కట్టారు.

అమరచింత మండల కేంద్రంలో ఇండియన్ బ్యాంక్ ఏటిఎం ఉంది. ఒక ఖాతాదారుడు డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లాడు. రూ.500 కావాలని పిన్ నమోదు చేయగానే రూ.2500 వచ్చాయి. ఆ ఖాతాదారుడు డబ్బులను చూసి షాకయ్యి, మరో మాట మాట్లాడకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన తరువాత వచ్చిన మరో కస్టమర్ రూ.4వేలు డ్రా చేస్తే రూ.20 వేలు వచ్చాయి. ఈ విషయం తెలిసిన తరువాత పలువురు ఏటిఎం ముందు క్యూ కట్టారు. ఇండియన్ బ్యాంక్ ఏటిఎం దగ్గర డబ్బులు ఎక్కువగా వస్తున్నాయని, జనం ఎగబడుతున్నారని ఎవరో ఫిర్యాదు చేయగా పోలీసులు చేరుకున్నారు. అక్కడ నిల్చున్న వారిని చెదరగొట్టి ఏటిఎం ను మూసివేయించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.