FbTelugu

ఫుడ్ పాయిజన్ అయి చిన్నారి మృతి

తూర్పుగోదావరి: ఫుడ్ పాయిజన్ అయి ఓ చిన్నారి మృతి చెంది, మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన జిల్లాలోని ఎటపాక మండలం, సాలుబుడప గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే..

స్థానిక సాలుబుడప గ్రామంలో జరిగిన ఓ వేడుకలో ఫుడ్ పాయిజన్ అయి 20 మంది అస్వస్థతకు గురైనారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఓ చిన్నారి పరిస్థితి విషమించి మృతి చెందింది. మరో చిన్నారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

You might also like