FbTelugu

యూ ట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి

అభిమానులకు టిక్ టాకర్ల వినతి

గల్వాన్ లోయలో జరిగిన దాడితో భారత ప్రభుత్వం చైనాకు సంబంధం ఉన్న వాటిపై కఠినంగా వ్యవహరిస్తున్నది.
ఈ నేపథ్యంలోనే టిక్ టాక్ యాప్ ను నిషేధించింది. దీంతో టిక్ టాక్ లో కార్యక్రమాలు చేసేవారు విలవిల్లాడిపోతున్నారు. గత నెలాఖరు వరకు భారత్ లో 12 కోట్ల మంది వినియోగదారులు (ఖాతాదారులు) ఉన్నారు. ఈ 12 కోట్ల మంది వినియోగదారులు ప్రతి రోజు అరగంట నుంచి గంట పాటు దీనిపై గడుపుతున్నారు.
సామాన్యులు మొదలు సంపన్నులు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు విరివిగా ఉపయోగిస్తున్నారు. కొంత మంది యూజర్లకు వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. కొందరు దీన్ని ఉపాధిగా మార్చుకున్నారు. ప్రతి రోజు రెండు వీడియోలు విడుదల చేస్తు అంతో ఇంతో సంపాదిస్తున్నారు. ఈ తరుణంలో దీనిపై కేంద్రం వేటు వేయడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు.

ఇక నుంచి తమను ఇన్ స్టాగ్రామ్, యూ ట్యూబ్ లో ఫాలో కావాల్సిందిగా వారు తమ అభిమానులను కోరతున్నారు. ఈ రెండు యాప్స్ చైనాయేతరం కావడంతో పలువురు ఎంచుకుంటున్నారు.

You might also like