FbTelugu

12 నుంచి మడతపెట్టే ఫోన్ బుకింగ్స్

ముంబై: మడత పెట్టే (ఫోల్డ్) ఫోన్ వచ్చేసింది. దక్షిణ కొరియా సాంకేతిక దిగ్గజం శాంసంగ్ గెలక్సా ఫోల్డబుల్ ఫోన్ జెడ్ ఫోల్డ్2 ను భారత మార్కెట్ లో అందుబాటులో పెట్టింది.

ఈ నెల 14వ తేదీ నుంచి ఫ్రీ బుకింగ్ కోసం అందుబాటులో పెట్టినట్లు కంపెనీ ప్రకటించింది. దీన్ని కొనుగోలు చేసిన వారికి పలు ఆఫర్లు ప్రకటించింది. ఏడాది పాటు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయంతో పాటు మూడు నెలల పాటు యూ ట్యూబ్ ప్రీమియం సౌకర్యం కల్పించనున్నారు. అదే విధంగా మైక్రోసాఫ్ట్ ఆఫీసు 365 22శాతం తగ్గింపునకు లభించనున్నది. మిస్టిక్ బ్రాంజ్, మిస్టిక్ బ్లాక్ రంగులలో లభించనున్న ఈ ఫోన్ ధర రూ.1,49,999 గా ఖరారు చేశారు.

స్క్రీన్ సైజును భారీగా పెంచారు. 7.6 అంగుళాలతోడైనమిక్ ఆమోలెడ్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 865ప్లస్ చిప్ సెట్, 12జీబీ రామ్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

 

You might also like