FbTelugu

చిన్నారుల కోసం వ్యాక్సిన్ పై దృష్టి

న్యూఢిల్లీ: నిద్రమత్తు నుంచి మేల్కొన్న కేంద్ర ప్రభుత్వం థర్డ్ వేవ్ పై అప్రమత్తమైంది. థర్డ్ వేవ్ లో చిన్నారులపై ప్రభావం చూపిస్తుందని వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చరించడంతో చర్యలు చేపట్టింది.

ప్రస్తుతం దేశంలో చిన్నారులకు ఏ విధమైన కరోనా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దేశంలో 2-12 ఏళ్ల వారిపై వ్యాక్సిన్ పరీక్షలకు ఇప్పటికే పచ్చ జెండా ఊపింది. అమెరికాలో 12 నుంచి 15 ఏళ్ల మధ్య పిల్లలకోసం ఫైజర్ తయారు చేసిన వ్యాక్సిన్ కు అక్కడి ప్రభుత్వం అత్యవసర వినియోగం కింద అనుమతించింది. థర్డ్ వేవ్ లో కరోనా చిన్నారులపై పంజా విసురుతుందన్న నివేదికల నేపథ్యంలో, చిన్నారులకు వ్యాక్సిన్ అందించే కార్యక్రమం పై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ ను రెండేళ్ల చిన్నారుల నుంచి 12 ఏళ్ల లోపు వారిపై పరీక్షించనున్నారు. క్లినికల్ పరీక్షలపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కు భారత్ బయోటెక్ ప్రతిపాదనలు అందచేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.