FbTelugu

ఫ్లైఓవర్ పై ఫల్టీ కొట్టిన కారు

చిత్తూరు: అదుపుతప్పి ఓ కారు ఫ్లైఓవర్ పైనుంచి సర్వీస్ రోడ్డుపై ఫల్టీ కొట్టి ఒకరు మృతి చెంది, మరొకరికి తీవ్రగాయాలైనాయి. ఈ ఘటన జిల్లాలోని చిన్నూరు సమీపంలోని ఫ్లైఓవర్ పై చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఇరాల మండలం, కొత్తూరుకు చెందిన పూర్ణచందర్ అనే వ్యక్తి, మరో వ్యక్తి కారులో వెళుతుండగా.. ప్రమాదవశాత్తు కారు ఫల్టీ కొట్టింది. పూర్ణచందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్రగాయాలైనాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like