నిర్మల్: ఎగువన కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 1,835 క్యూసెక్కులు ఉండగా.. దిగువకు నీటిని వదలడం లేదు. ప్రస్తుత నీటి నిల్వ 3.295 టీఎంసీ (థౌజెండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ వాటర్) గా ఉంది.
కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 7.603 టీఎంసీలు. నైరుతి రుతుపవనాల దేశ వ్యాప్తంగా వ్యాపించిన తరుణంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.