FbTelugu

సాగర్ కు 40 వేల క్యూసెక్కుల వరద

నల్లగొండ: ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్ కు వరద కొనసాగుతోంది. ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టుకు 40,259 క్యూసెక్కుల వరద వస్తోంది. దిగువకు 6001 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 561 అడుగులు ఉంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 234.81 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

You might also like