FbTelugu

ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద

విజయవాడ: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతున్నది. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ జిల్లాలో వర్షం, ప్రకాశం బ్యారేజీపై పరిస్థితిని సమీక్షించారు.

మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. వరద ఉధృతి పెరగడంతో 70 గేట్లను ఒక అడుగు మేర ఎత్తివేసి 80వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నామన్నారు. ఇన్ ఫ్లో 77వేల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 44వేల క్యూసెక్కులుగా ఉందన్నారు.

You might also like