FbTelugu

శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గుముఖం

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 42,369 క్యూసెక్కులుగా ఉంది.

అవుట్ ఫ్లో 40,259 క్యూసెక్కులు కాగా జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం (ఎఫ్ టీఎల్) 885 అడుగులు. అయితే ప్రస్తుత నీటి మట్టం 854.60 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 90.7712 టీఎంసీలుగా ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు.

You might also like