FbTelugu

ఫ్లిప్ కార్ట్ సేల్ అర్థరాత్రి నుంచే…

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ షాప్ ప్రమ్ హోం డేస్ ను మరికొద్ది గంటల్లో ప్రారంభించనున్నది. ఈ సేల్ 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగనున్నది.

మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, టాబ్లెట్లు, స్మార్ట్ టీవి, ఫ్రిజ్ లు, ఫర్నీచర్, కిరాణా సామాను కొనుగోలుచేసిన వారికి 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇవ్వనున్నది. అసుస్, రియల్ మీ, శాంసంగ్, పోకో బాండ్లపై ఆఫర్లు ఇస్తున్నది. దీంతో పాటు ఎక్చేంజ్ సేల్, నో కాస్ట్ ఈఎంఐ కూడా ప్రకటించింది. హెచ్.డి.ఎఫ్.సి క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై పదిశాతం తగ్గింపు వెంటనే లభించనున్నది. ఇంకేముంది ఈరోజు అర్థరాత్రి నుంచి ప్రారంభమయ్యే సేల్ లో పాల్గొనండి.

You might also like

Leave A Reply

Your email address will not be published.