FbTelugu

నేటినుంచి తిరుపతికి విమానాలు

తిరుపతి: నేటినుంచి తిరుపతి విమానాశ్రయానికి విమానాల రాకపోకలు ప్రారంభం అవుతాయని అధికారులు స్పష్టం చేశారు. కాసేపట్లో హైదరాబాద్ నుంచి తిరుపతికి ఇండిగో విమానం బయలుదేరనుంది.

ఇందులో భాగంగా ప్రతి ప్రయాణికున్నీ వైద్యులు పరీక్షించనున్నారు. థర్మల్ స్ర్కీనింగ్, శానిటైజ్ వంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే విమాన ప్రయాణానికి అనుమతించనున్నారు. కరోనా లక్షణాలు ఉంటే వారిని క్వారంటైన్ కు పంపనున్నట్టు తెలుస్తోంది.

You might also like