అమరావతి: కర్నూలు విమానాశ్రయంలో వాణిజ్య విమానాల రాకపోకలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతించింది. వచ్చే మార్చి నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
విమానాశ్రయ పనులు వేగవంతం చేయాలని గతేడాది కేంద్ర పౌర విమానయాన శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది. పనులు పూర్తి కావడంతో ఇటీవల ఢిల్లీ డీజీసీఏ అధికారుల బృందం కర్నూలు వచ్చి విమానాశ్రయంలో మౌలిక వసతులు, ఇతర పనులను పరిశీలించి వెళ్లారు. నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించడంతో డీజీసీఏ విమానాల రాకపోకలకు పచ్చజెండా ఊపింది.