FbTelugu

2 నెలల తర్వాత ఎగిరిన విమానాలు…

ఢిల్లీ నుంచి పుణె కు తొలి విమానం

ఢిల్లీ: లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో రెండు నెలల తరువాత విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు మొదలయ్యాయి. ఇవాళ అర్థరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా డొమెస్టిక్ విమానాలు ప్రయాణీకులను తీసుకువెళ్లాయి.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి విమానం బయలుదేరి పుణె కు ఈ ఉదయం చేరుకుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అన్ని విమానాశ్రయాల్లో దేశీయ టెర్మినళ్ల వద్ద పరిశుభ్రత ప్రమాణాలు అమలు చేశారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ తరువాతే అనుమతించారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టారు. ఎవరైనా ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తే హెచ్చరిస్తున్నారు. ప్రయాణీకుల మధ్య భౌతిక దూరం (ఫిజికల్ డిస్టాన్స్) పాటించేలా ఏర్పాట్లు చేశారు. సిబ్బంది ప్రత్యేక రక్షణా కిట్లను ధరించి విధులకు హాజరయ్యారు.

విమానాశ్రయాల్లో ఆహార, శీతల పానీయాల ఔట్‌లెట్లు తెరచి పెట్టారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో విమాన సేవల్ని పునరుద్ధరించారు. ఏపీలో బుధవారం నుంచి, పశ్చిమ బెంగాల్‌లో గురువారం నుంచి విమానాల రాకపోకలు పునఃరుద్దరించనున్నారు.

You might also like