FbTelugu

గాల్లో విమానం చక్కర్లు

అమరావతి: అమరావతిలో పొగమంచు సమస్య అప్పుడప్పుడు తలెత్తుండడం మూలంగా విమానాలకు సమస్యగా పరిణమించింది. న్యూఢిల్లీ మాదిరే అమరావతి పొగమంచు సమస్యగా మారింది.

ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకునే ఎయిరిండియా విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇవాళ ఉదయం 7:15 గంటలకు విమానం దిగాల్సి ఉండగా దట్టమైన పొగమంచు కారణంగా గన్నవరం చుట్టూ గాలిలో చక్కర్లు కొట్టింది. దీంతో ప్రయాణీకులు గాబరాపడ్డారు. కాసేపట్లో విమానం ల్యాండ్ అవుతుందని భయపడవద్దని విమాన సిబ్బంది భరోసా ఇచ్చారు. ఢిల్లీ నుంచి 78 మంది ప్రయాణికులతో ఎయిరిండియా విమానం గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరింది. తిరుగు ప్రయాణంలో గన్నవరం విమానాశ్రయం నుంచి 173 మంది ప్రయాణికులు ఢిల్లీకి వెళ్లనుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.