FbTelugu

బెల్ట్ దుకాణాలపై ఫ్లెక్సీలు

తాడేపల్లి: గుండిమేడ గ్రామంలో బెల్ట్ దుకాణాల జోరు ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామ పెద్దలే ఫ్లెక్సి లు ఏర్పాటు చేయించారు. బహిరంగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సి లను చూసి గుంటూరు జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.

మండల, జిల్లా స్థాయి ఎక్సైజ్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇలా నిరసన వ్యక్తం చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో గ్రామానికి చేరుకుని ఫ్లెక్సిలను తొలగించారు. తాడేపల్లి మండలం లో జోరుగా బెల్టు దుకాణాల దందా జరుగుతుంది అనడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం పై వెలిసిన ఫ్లెక్సి లపై మండలానికి చెందిన ప్రజలు చర్చించుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.