FbTelugu

ప్రియురాలు దక్కలేదని దాడి.. ఐదుగురు మృతి

రాయచూర్: కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. రాయపూర్ జిల్లా సింధనూర్ లో మౌనేష్ అనే ఓ యువకుడు తను ప్రేమించిన మంజుల అనే యువతి దక్కలేదన్న అక్కసుతో ఉన్మాదిగా మారాడు.

ఇటీవలే.. మరో యువకున్ని మంజుల వివాహం చేసుకోవడంతో.. ప్రియురాలి కుటుంబీకులపై తన స్నేహితులతో కలిసి ఏకంగా రాళ్లతో దాడికి దిగాడు. రాళ్లు బలంగా తగలడంతో మంజుల సహా ఆమె భర్త, అత్తమామలు, మరో వ్యక్తి మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.