FbTelugu

క్వారీ చరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం

ప్రమాదవ శాత్తు క్వారీ చరియలు విరిగిపడి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని షాడోల్ జిల్లాలో ఇవాళ చోటుచేసుకుంది. విరాల్లోకెళితే.. స్థానిక బియోహ‌రి ఏరియాలోని ఓ క్వారీలో కూలీలు మట్టిని తవ్వుతున్నారు.

కాగా గత కొన్ని రోజులుగా వర్షం కారణంగా బాగా నానిన చరియలు ఒక్కసారిగా కూలీలపై పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలైనాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

You might also like