FbTelugu

ఐదుగురు సామూహిక ఆత్మహత్య?

పాట్నా: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకోవడం సుపౌల్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. రాఘోపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గద్దీలో ఈ ఘటన చోటు చేసుకున్నది.

గద్దీలోని ఒకే కుటుంబంలో శుక్రవారం అర్థరాత్రి దాటాక భార్యభర్తతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసి గ్రామస్థులు పెద్ద ఎత్తున ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం మిశ్రీలాల్ సాహ్ (50) ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు సర్పంచికి సమాచారం ఇచ్చారు. సర్పంచి అక్కడికి చేరుకుని కొందరు యువకుల సాయంతో తలుపులు బద్దలు కొట్టించి లోపలికి వెళ్లారు. ఒకే గదిలో కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరేసుకుని ఉన్నట్లు కన్పించారు. వెంటనే సర్పంచి రాఘోపూర్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కిందకి దించి పంచనామా చేసి పోస్టుమార్టం పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి తగాదాలు, వ్యక్తిగత గొడవలు, కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు ఆరా తీశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.