FbTelugu

లేగదూడ కోసం వెళ్లి.. ఐదుగురు దుర్మరణం

బావిలో పడిన ఓ లేగదూడను కాపాడే ప్రయత్నం ఐదుగురు దుర్మరణం పాలైన దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని గోండాజిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. జిల్లాలోని స్థానిక రాజామోహల్లాలో ఓ బావిలో ఓ లేగదూడ ప్రమాదవ శాత్తు పడిపోయింది. దీంతో ఆ లేగదూడను కాపాడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తూ.. అందులోనే కుప్పకూలాడు. అది గమనించిన మరో నలుగురు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు.

వారు కూడా మొదటి వ్యక్తిలాగే అందులోనే కుప్పకూలారు. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని వారిని బయటకు తీశారు. అప్పటికే వారు మృత్యువాత పడ్డారు. ఆ బావిలో స్థానికులు చెత్తాచెదారం వేయడంతో ఆ బావిలో మీథేన్ లాంటి ప్రమాదకర వాయువులు విడుదలైనాయని. వాటి ప్రభావంతోనే వారు మృత్యువాత పడ్డారని తెలిపారు.

You might also like