FbTelugu

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

సిద్దిపేట: కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న కారు సిద్దిపేట రంగీలా చౌరస్తా సమీపంలో కల్వర్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే అక్కడ గుమిగూడిన ప్రజలపైకి డీసీఎం వాహనం తూసుకెళ్లడంతో మరో ఇద్దరు చనిపోయారు. మొత్తం ఈ ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లాకు చెందిన న్యాయవాది  బయ్యపు నరేందర్ రెడ్డి (39) తండ్రి రాజిరెడ్డి, తల్లి విజయతో కలిసి కరీంనగర్ చేరుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. సిద్దిపేట శివారు రంగీలా చౌరస్తాలో రోడ్డు పక్కనున్న కల్వర్టును కారు బలంగా ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోయారు.

ప్రమాదాన్ని చూసేందుకు జనం గుమిగూడారు. అదే మార్గంలో వస్తున్న డీసీఎం వాహనం గుమిగూడిన ప్రజలపైకి దూసుకురావడంతో మరో ఇద్దరు దుర్మరణం చెందారు. చిన్నకోడూరు మండలం రామునిపట్లకు చెందిన మల్లేశం (40), సిద్దిపేట అర్బణ్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి (50) అక్కడికక్కడే చనిపోయారు. వీరితో పాటు టూ టౌన్ సీఐ పరాశం గౌడ్, మరో నలుగురు పోలీసులు సహా పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.