FbTelugu

ఆక్సిజన్ లేక ఐదుగురు మృతి

కర్నూలు: నగరంలో కె.ఎస్ కేర్ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐదుగురు కోవిడ్ పేషేంట్స్ ఆక్సిజన్ అందక చనిపోయారు. అనుమతి లేని కె.ఎస్ కేర్ ఆసుపత్రిలో ఉన్న పేషేంట్స్ అందరినీ అంబులెన్స్ లలో కర్నూలు జిజిహెచ్ కు తరలించారు.

ప్రభుత్వం నుంచి అనుమతులు లేనప్పటికీ పేషెంట్లను చేర్చుకుని కోవిడ్ చికిత్స చేస్తున్నారు. ఆక్సిజన్ అయిపోవడం, సకాలంలో అందకపోవడంతో ఐదుగురు కోవిడ్ పేషెంట్లు ఐసియులో ప్రాణాలు వదిలారు. పరిస్థితి చేయిదాటిందని గమనించిన వైద్యులు ఆసుపత్రి నుంచి తప్పించుకున్నారు. పేషెంట్ల బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఈ లోగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చేరుకుని చర్యలు చేపట్టారు. ఎటువంటి అనుమతి లేకుండా కోవిడ్ పేషేంట్స్ ను అడ్మిట్ చేసుకుని అనధికారికంగా ట్రీట్ మెంట్ ఇచ్చిన కె.ఎస్ కేర్ ఆసుపత్రి యజమాన్యంపై క్రిమినల్ కేసు బుక్ చేశామని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం ప్రకారం తదుపరి చర్యలు చేపడతామన్నారు.

జిల్లాలో ఎక్కడైనా, ఎవరైనా ప్రభుత్వం/జిల్లా యంత్రాంగం అనుమతి లేకుండా అనధికారికంగా కోవిడ్ ఆసుపత్రులు లేదా కోవిడ్ కేర్ సెంటర్స్ నడిపితే క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేసి సీజ్ చేయిస్తామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. కోవిడ్ కు సంబంధించి టెస్టింగ్, బెడ్స్, నోటిఫైడ్  ఆసుపత్రుల వివరాలు,  ఫీజులు తదితర అన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 104 కాల్ సెంటర్ కు కాల్ చేసి చెప్పాలని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.