FbTelugu

ఆటోను ఢీకొట్టిన లారీ… ఆరుగురు మృతి!

ప్రమాదంలో మృతి చెందిన పెళ్లి కుమార్తె

మహబూబాబాద్: మర్రిమిట్ట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.

గూడూరు మండలం మర్రిమిట్ట శివారు లో ఎదురుగా వస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఆ సమయంలో 6గురు ప్రయాణికులు ఆటోలో ఉన్నారు. బలంగా కొట్టడంతో ఆటో తునాతునకలు అయ్యింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు మొత్తం కూడా గుడూరు మండలం ఎర్రకుంట తండా కు చెందిన వారు. అందరు కలిసి పెళ్లి బట్టల కోసం నర్సంపేట కి వెళ్తుండగా మార్గం మధ్య లో రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంతో తండా లో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లి కూతురు కూడా ఈ ప్రమాదంలోనే మృతి చెందింది.

పోలీసులు సమాచారం తెలుసుకుని సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.