FbTelugu

కారు, టిప్పర్ ఢీకొని ఐదుగురు దుర్మరణం

హైదరాబాద్ : కారు, టిప్పర్ ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందిన ఘటన నగరంలోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ స్థానిక గచ్చిబౌలిలో వేగంగా వచ్చిన ఓ కారు, మరో టిప్పర్ బలంగా ఢీకొన్నాయి.

ఈ ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతులు 25 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. మృతులు మాదాపుర్‌ అయ్యప్ప సొసైటీకి చెందిన చింతా మోహన్, సంతోష్, భరద్వాజ, రోషన్, పవన్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.