FbTelugu

బెంగాల్ లో కాల్పులు… ఐదుగురు మృతి

కొలకతా: పశ్చిమ బెంగాల్ లో నువ్వా నేనా అనే విధంగా అధికార టిఎంసి, బిజెపిలు బలంగా తలపడుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ మొదలు ఇప్పటి వరకు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి.

అక్కడక్కడ విధ్వంసాలు కూడా జరుగుతున్నాయి. ఇవాళ బెంగాల్ లో కొన్ని ప్రాంతాల్లో నాలుగో విడత పోలింగ్ సందర్భంగా కుచ్ బెహర్ జిల్లాలో టిఎంసి, బిజెపి కార్యకర్తలు తలపబడ్డారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు ఒకరు చనిపోయారు.
సీతల్ కుచిలో గల ఒక పోలింగ్ కేద్రం ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆనంద్ బుర్మాన్ అనే యువకుడికి కాల్పులు జరిపిన అగంతకులు అక్కడి నుంచి పరారీ అయ్యారు. కాల్పులతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. చనిపోయిన వ్యక్తి తమవాడు అంటే తమవాడు అని రెండు పార్టీలు పరస్పరం ఆరోపించుకున్నాయి. తమవాడిని చంపారంటూ ఇరు పార్టీలు పోలింగ్ కేంద్రం వద్దే ఘర్షణకు దిగి బాంబులు విసురుకున్నారు. ఈలోపు సిఆర్పిపిఎఫ్ బలగాలు అక్కడకు చేరుకుని ఆందోళకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి మరింతగా ముదురుతుండడంతో ఆందోళకారులపై కాల్పులు జరపగా నలుగురు చనిపోయారు.
హుగ్లి ప్రాంతంలో బిజెపి అభ్యర్థి లాకెట్ చటర్జీ వాహనంపై స్థానికులు రాళ్ల తో దాడికి తెగబడ్డారు. మీడియా వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఈ ప్రాంతంలో రిగ్గింగ్ జరుగుతోంది, ఎన్నికల అధికారులు వచ్చేంత వరకు కదిలేది లేదంటూ లాకెట్ అక్కడే బైఠాయించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.