FbTelugu

యాక్సిడెంట్ లో ఐదుగురు మృతి

నెల్లూరు: సంగం మండలం దువ్వూరు గ్రామం వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని వెనుక వైపు నుంచి పాల వ్యాను ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దువ్వూరు వద్ద కూలీలు టాటా ఏస్ వాహనం ఎక్కుతుండగా ప్రమాదం జరిగింది.

సీఐ సురేష్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. క్షతగాత్రులను బుచ్చి, నెల్లూరు ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. సంగం మండలం దువ్వూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందడం కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులకు మంత్రి మేకపాటి ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.