హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాత ఆయా ప్రాంతాల్లో ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మార్కులు తక్కువ వచ్చాయని కొందరు, ఫెయిల్ అయ్యామని మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో సరయూ అనే విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
వికారాబాద్ జిల్లాకు చెందిన నిఖిత, బద్వెల్ కు చెందిన బద్రీనాథ్ అనే విద్యార్థులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లాలో సోనీ అనే విద్యార్థిని పురుగుల మందు తాగిఆత్మహత్య చేసుకుంది. గజ్వెల్ కు చెందిన శ్రావణి అనే విద్యార్థిని కూడా ఆత్మహత్యకు పాల్పడింది.