FbTelugu

తమిళ క్యాబినెట్ లో ఐదుగురు ఆంధ్రులు

చెన్నై: కొత్తగా కొలువుదీరిన తమిళనాడు మంత్రివర్గంలో ఐదుగురు ఆంధ్రులకు స్థానం దక్కింది. ప్రమాణం చేసిన 34 మంది మంత్రులలో ఐదుగురు ఆంధ్రులు ఉండడం గమనార్హం.
గతంలో సీఎంలుగా పనిచేసిన ఎం.కరుణానిధి, కుమారి జె.జయలలిత, పళనిస్వామి, పన్నీర్ సెల్వం అందరూ తమ మంత్రివర్గంలో ఆంధ్రులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు. కరుణానిధి కుమారుడు ఎం.కె. స్టాలిన్ కూడా అదే ఒరవడిని కొనసాగించారు. తమిళనాడు ఆంధ్ర ప్రాంతం వేరుపడక ముందు చెన్నై రాష్ట్రరాజధానిగా ఉండేది. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో ఆంధ్రులు పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. ఆంధ్ర ప్రాంత ఓటర్ల కోసం అన్ని పార్టీలు టికెట్లు ఇస్తుంటాయి. మొన్నటి ఎన్నికల్లో 15 మంది ఆంధ్రులు వివిధ పార్టీల నుంచి విజయం సాధించారు.

స్టాలిన్ మంత్రివర్గంలో ఆంధ్రులు…
1. కెకెఎస్.రామచంద్రన్ – అరుప్పుకొట్టై ఎమ్మెల్యే, రెవెన్యూ శాఖ మంత్రి.
2. ఏ.వేలు – తిరువణ్ణామలై ఎమ్మెల్యే, పీడబ్ల్యూడీ శాఖ మంత్రి
3. ఆర్.గాంధీ – రాణిపేట ఎమ్మెల్యే, టెక్స్ టైల్ శాఖ మంత్రి.
4. పికె.శేఖర్ బాబు – చెన్నై దురైముగం ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రి.
5. కెఎన్.నెహ్రూ – తిరుచ్చి వెస్ట్ ఎమ్మెల్యే, మున్సిపల్ శాఖ మంత్రి.

టికెట్ డబ్బులు ఇంటికి ఖర్చు చేస్తాం…
ఆర్టీసి బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఖర్చు తగ్గుతుందని… ఈ డబ్బులను ఇంటి కోసం వినియోగిస్తామంటుని మహిళలు తెలిపారు. సిఎం గా ప్రమాణం చేసిన వెంటనే స్టాలిన్ శుక్రవారం నాడు మహిళలకు ఉచిత బస్సు సర్వీసు పథకంపై సంతకం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.